Monday, 8 December 2014

About Savitri - Biography in Telugu - సావిత్రి

మహానటిగా గుర్తింపు పొందిన సావిత్రి 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించారు.చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సావిత్రి పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య వద్ద పెరిగారు.శిష్టల పూర్ణయ్య శాస్త్రి వద్ద కూచిపూడి నాట్యాన్ని అభ్యసించారు.ఆమె నాట్య కళాప్రతిభను చూసిన డైరెక్టర్ ఎల్.వి.ప్రసాద్ 1950 లో సంసారం చిత్రంలో నటించడానికి ఆమెకు ఆహ్వానం పంపారు.ఆమెకు ఇంకా నటనకు సంభధించిన పరిణతి రాలేదని ఆమెకు ఒక చిన్న పాత్రను ఇచ్చారు.ఈ విధంగా "సంసారం" చిత్రంతో ఆమె సినీ ప్రస్తానం ప్రారంభమైంది.1952లో ' మనంపో మాంగల్యం' చిత్రంలో జమినీ గణేశంతో హీరోయిన్ పాత్రలో నటించారు. అదే సంవత్సరంలో అయనను వివాహమాడారు.
తెలుగు తమిళ చిత్రాలతో సహా ఆమె దాదాపు 250 చిత్రాలలోనటించారు. మిస్సమ్మ, మాయాబజార్, దేవదాసు, నర్తనశాల, మూగమనసులు చిత్రాలలో ఆమె నటన అనితర సాధ్యం. చివరకు మిగిలేది చిత్రం లో ఆమె నటన అపూర్వం. ఆచిత్రం ఆమె జీవితానికి దర్పణంగా నిలుస్తుంది.1971లో ప్రాప్తం సినిమాతీసి ఆర్ధికంగా చాలా నస్టపోయారు.ఆమె సొంత ఇల్లును అమ్ముకొని అద్దె ఇంటిలో నివసించవలసి వచ్చింది.ఆమె చివరి చిత్రం'అందరికంటే మొనగాడు(1981). 1980 లో అస్వస్థకు గురై కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె 1981 డిసెంబర్ 26న స్వర్గస్థులయ్యారు.

Devadasu - 1953 - Super Hit Telugu Movie - Full Film YouTube Video
1953 Super Hit
A. Nageswara Rao, Savitri, Peketi Sivaram


Mangalya Balam - 1959 Super Hit Telugu Movie - Full Film YouTube Video
1959 Super Hit
Nageswara Rao, Savitri, SV Ranga Rao, Relangi